మోహ‌న్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్

Mohan Babu Son of India Movie first look.మోహ‌న్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2021 5:35 AM GMT
Mohan Babu Son of India Movie first look

విల‌న్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా సెటిల్ అయ్యారు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు. దాదాపు న‌ల‌భై ఏళ్లుగా న‌టుడిగా, నిర్మాత‌గా, స‌మ‌ర్ప‌కుడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న హ‌వాను చూపిస్తోన్నారు. కొన్ని వంద‌ల సినిమాల్లో న‌టించి మొప్పించారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. ర‌చ‌యితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ ప్రారంభ‌మైన ఈచిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.


ఈ పోస్ట‌ర్ చూసిన మంచు అభిమానులంతా పుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్‌లో మోహన్ బాబు మెడలో రుద్రాక్ష మాలతో దేశం కోసం తపన పడే వ్యక్తిగా క‌నిపిస్తున్నాడు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. మోహ‌న్‌బాబు మ్యాన‌రిజానికి త‌గ్గ‌ట్టుగా పాత్ర ప‌వ‌ర్‌పుల్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విరూపాక్ష అనే పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. అదేవిధంగా శ్రీకాంత్ కూడా మమేంద్రభూపతి అనే పాత్ర చేస్తున్నారు. వీరితో పాటుగా తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Next Story
Share it