టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపించబోతున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటిని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన త్వరలోనే యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టు తెలిపారు. యం.బీ.యూ గా దీనికి నామకరణం చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 'మోహన్ బాబు యూనివర్సిటీ' ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

'చిన్న విత్తనాలతో పెరిగిన శ్రీవిద్యానికేతన్ ఇప్పుడు కల్పవృక్షంగా మారింది. 30 ఏళ్ళ మీ నమ్మకం ఇప్పుడు నన్ను విశ్వవ్యాప్తమైన విద్యవైపుకు పురిగొల్పుతోంది. ఆ కృతజ్ఞతతోనే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపిస్తున్నాను. మీ ప్రేమే నా బలం. నా ఈ కలకు కూడా మీరు సహకారం అందిస్తారని నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో నేను ఈ విషయాన్ని వినయపూర్వకంగా ప్రకటిస్తున్నాను'.. అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story