ఆ ఇద్ద‌రూ మంచు ల‌క్ష్మిని నీటిలో ప‌డేశారు.. వీడియో వైర‌ల్‌

Mohan babu and Vishnu Throws Manchu Lakshmi in Swimming pool.మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 1:33 PM IST
ఆ ఇద్ద‌రూ మంచు ల‌క్ష్మిని నీటిలో ప‌డేశారు.. వీడియో వైర‌ల్‌

మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మోహ‌న్ బాబు కుమారైగానే కాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొద్ది మంది న‌టీన‌టుల్లో మంచు ల‌క్ష్మి ఒక‌రు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె త‌న సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో మంచు ల‌క్ష్మిని ఆమె తండ్రి మోహ‌న్ బాబు, సోద‌రుడు హీరో మంచు విష్ణు ఇద్ద‌రు క‌లిసి ఆమెను స్విమ్మింగ్ పూల్ లో ప‌డేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. మంచు విష్ణు త‌న కుటుంబ స‌భ్యుల‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది ల‌క్ష్మి. ఇంత‌లో విష్ణు అంద‌రి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్క‌రు బ్యాలెన్స్ ఉన్నార‌నుకున్నాడు. అంతే వెంట‌నే ల‌క్ష్మి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు న‌డిచాడు. దీంతో విష‌యం అర్థ‌మైన ల‌క్ష్మి వ‌ద్దంటూ కేక‌లు పెట్టింది. అయిన‌ప్ప‌టికీ త‌గ్గేదేలే అంటూ మోహ‌న్‌బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్ల‌లో ప‌డేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మంచు ల‌క్ష్మి అంతా నా క‌ర్మ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story