నదిలో దొరికిన దర్శకుడి మృతదేహం
తమిళ దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం లభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 9:00 PM ISTనదిలో దొరికిన దర్శకుడి మృతదేహం
తమిళ దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం లభించింది. తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన దర్శకుడు వెట్రి దురైసామి శవమై కనిపించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నదిలో డైరెక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెట్రి తండ్రి, చెన్నై మాజీ మేయర్ సైదై దురైసామి తన కొడుకు ఆచూకీ తెలిపిన వారికి కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. సహాయక చర్యలకు సహకరించాల్సిందిగా స్థానిక ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతలో దురైసామి మరణించాడనే వార్త వచ్చింది.
తిరుప్పూర్‌కి చెందిన స్నేహితుడు గోపీనాథ్‌తో కలిసి కొద్దిరోజుల కిందట హిమాచల్‌ప్రదేశ్ సందర్శనకు వెళ్లిన ఆయన ప్రమాదం తర్వాత అదృశ్యమయ్యారు. గత 9 రోజులుగా కనిపించకుండా పోయిన వెట్రి దురైస్వామి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. చెన్నై మాజీ మేయర్, మనిదనేయ మక్కల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సైదై దురైస్వామి కుమారుడు వెట్రి దురైస్వామి తిరుప్పూర్‌కి చెందిన స్నేహితుడు గోపీనాథ్‌తో కలిసి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం కసాంగ్ నలా ప్రాంతంలో జాతీయహైవేపై వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోయింది. వాళ్లు కాజా ప్రాంతం నుంచి సిమ్లా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు. గోపీనాథ్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. రమ్య నంబీషన్, విధార్థ్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఎంద్రావతు ఒరు నాల్ (2021)' చిత్రానికి వెట్రి దురైసామికి మంచి పేరు వచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ వెట్రికి మంచి మిత్రుడు. వెట్రి దురైసామి మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం తదితరులు సంతాపం తెలిపారు.