న‌టుడు సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav on Sai Dharam Tej health condition.రోడ్డు ప్ర‌మాదంలో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 7:22 AM GMT
న‌టుడు సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

రోడ్డు ప్ర‌మాదంలో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డ‌డంతో అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్.. తేజ్‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. వినాయ‌కుడి ద‌య‌వ‌ల్ల సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ఏమీ కాలేద‌న్నారు. ప్ర‌మాదం నుంచి స్వ‌ల్ప‌గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డార‌న్నారు.హెల్మెట్, షూస్, జాకెట్ వేసుకోవడం వల్ల.. చిన్న చిన్న‌గాయాలు మాత్ర‌మే అయ్యాయ‌ని తెలిపారు. స్వ‌ల్ప ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు ఎంఆర్ఐ స్కాన్‌లో తేలింద‌ని తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. తేజ్ స్పృహలోనే ఉన్నారన్నారు. ఘ‌ట‌న‌పై మీడియా సంయ‌మ‌నం పాటించాల‌ని మంత్రి కోరారు. తేజ్ ఆరోగ్యం పై అస‌త్య ప్ర‌చారాలు చేయ‌వ‌ద్ద‌ని మంత్రి తెలిపారు.

ఈ ఉద‌యం సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై అపోలో ఆస్ప‌త్రి వైద్యులు మ‌రో బులిటెన్‌ను విడుద‌ల చేశారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. ప్ర‌ధాన అవ‌య‌వాలు బాగానే ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌నున్న‌ట్లు ఆ బులిటెన్‌లో తెలిపారు. రేపు మ‌రో బులిటెన్‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

Next Story