బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

Minister Roja Responds On Balakrishna Comments. 'అక్కినేనా.. తొక్కినేనా' అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

By Medi Samrat
Published on : 25 Jan 2023 8:45 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

'అక్కినేనా.. తొక్కినేనా' అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అంతేకాకుండా అక్కినేని హీరోలు కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక బాలయ్య మాటలపై సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఆర్ కుటుంబానికి క్షమపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఆ కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో స్టేజ్ మీద మాట్లాడటం తన అహంకార పూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోందని అక్కినేని అభిమానులు బహిరంగంగా విమర్శలకు దిగారు.

ఈ వివాదంపై ఏపీ మంత్రి, సినీ నటి రోజా స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచించుకోవాలని అన్నారు.

ఎస్వీ రంగారావు కాపు సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ నటుడు. ఆయనను కూడా బాలకృష్ణ కించపర్చడం పట్ల కాపు నాడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాపు నాడు ప్రతినిధులు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు.


Next Story