లైగ‌ర్ నుంచి మైక్ టైసన్ ఫస్ట్ లుక్ విడుదల

Mike Tyson First Look from Liger movie released.విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం లైగ‌ర్‌. పూరీ జ‌గ‌న్నాథ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 7:47 AM GMT
లైగ‌ర్ నుంచి మైక్ టైసన్ ఫస్ట్ లుక్ విడుదల

విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం 'లైగ‌ర్‌'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌ర‌స‌న అనన్య పాండే న‌టిస్తోంది. ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలిపింది. ఈ క్రమంలో మైక్ టైసన్ కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.

మైక్ టైస‌న్ లుక్ విడుద‌ల చేస్తూ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో మైక్‌ టైసన్‌ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ అప్‌డేట్ విజ‌య్‌దేవ‌ర‌కొండ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యాక్షన్ సన్నివేశాల‌ను థాయిలాండ్ కు చెందిన స్టంట్ డైరెక్టర్ కెచ్చా కంపోజ్ చేస్తుండ‌గా.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Next Story
Share it