రానా భార్య ప్రెగ్నెంట్..? మిహికా ఏం చెప్పిందంటే..?

Miheeka Clarity on Pregnancy Rumours.టాలీవుడు న‌టుడు రానా దగ్గుబాటి త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాబ్‌ను ఆగ‌స్టు 8, 2020న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 2:30 PM IST
రానా భార్య ప్రెగ్నెంట్..? మిహికా ఏం చెప్పిందంటే..?

టాలీవుడు న‌టుడు రానా దగ్గుబాటి త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాబ్‌ను ఆగ‌స్టు 8, 2020న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ జంట త‌మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మిహిక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న భ‌ర్త‌తో, కుటుంబంతో క‌లిసి ఉన్న ఫోటోలను పోస్టు చేస్తోంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు కార‌ణం.. ఇటీవ‌ల మిహికా షేరే చేసిన ఫోటోలో ఆమె కొంచెం బొద్దుగా క‌నిపించింది.


దీంతో.. నెటీజ‌న్లు 'మిహికా మీరు తల్లికాబోతున్నారా?' అని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెట్టారు. దీనిపై మిహికా స్పందించింది. అలాంటిది ఏమీ లేద‌ని చెప్పుకొచ్చింది. ఇది పెళ్లి త‌రువాత సాధార‌ణంగా అమ్మాయిల్లో వ‌చ్చే మార్పేన‌ని చెప్పింది. మిహికా చెప్పిన స‌మాధానం రానా తండ్రి కాబోతున్నాడు అన్న వార్త‌ల‌కు ఎట్ట‌కేల‌కు పుల్ స్టాప్ ప‌డింది. ఇక త్వ‌ర‌లోనే ఈ జంట శుభ‌వార్త చెప్పాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story