'ఆ హీరో నా సొంత కొడుకు'.. సీనియర్ నటుడు సంచలన కామెంట్స్
నటుడు ఢిల్లీ కుమార్ తాను హీరో అరవింద్ స్వామికి తండ్రి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
By అంజి Published on 11 Sept 2023 10:22 AM IST'ఆ హీరో నా సొంత కొడుకు'.. సీనియర్ నటుడు సంచలన కామెంట్స్
90వ దశకంలో ఎంతో మంది యువతులను ఆకట్టుకున్న అతికొద్ది మంది రొమాంటిక్ హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. అరవింద్ స్వామి లాంటి భర్త కావాలని ఆ కాలంలో పెళ్లి వయసు వచ్చిన మహిళలు తమ తల్లిదండ్రులను వేధించిన కథలు ఎన్నో ఉన్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం తలపతిలో కలెక్టర్‌గా కొన్ని సన్నివేశాల్లో కనిపించినప్పటికీ, సినిమాలో అతని మనోహరమైన లుక్‌తో కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. తొలి సినిమాతోనే చెప్పుకోదగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి.. మణిరత్నం తదుపరి చిత్రం రోజాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అరవింద్ స్వామి ప్రమాదానికి గురై గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత కసరత్తు చేస్తూనే మళ్లీ చాలా గ్యాప్ తర్వాత 'తని ఒరువన్'లో విలన్‌గా నటించాడు.
ఇప్పటివరకు హీరోగా నటించిన అరవింద్ స్వామి రీ ఎంట్రీ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మాస్‌లో తన సత్తా చాటుకున్నాడు. అరవింద్ స్వామి తండ్రి దివంగత తమిళ ప్రముఖ బిజినెస్ మెన్ వెంకటరామ దొరై స్వామి అని అందరికి తెలిసిందే. అయితే తాజాగా సీరియల్ నటుడు ఢిల్లీ కుమార్ తాను నటుడు అరవింద్ స్వామికి తండ్రి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నటుడు ఢిల్లీ కుమార్ అరవింద్ స్వామి నా సొంత కొడుకు అంటూ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీరియల్ నటుడు ఢిల్లీ కుమార్ ఇటీవల ఒక ప్రముఖ మీడియా పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అరవింద్ స్వామి తన కుమారుడని, అతను పుట్టిన వెంటనే తన సోదరి అతన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పాడు.
కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే.. మాత్రమే అతను ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే వెళ్లిపోతుంటానని, అందుకే అతనితో తరచూ మాట్లాడలేకపోతున్నానని చెప్పాడు. తమ మధ్య తండ్రి కొడుకుల బంధం లేదని చెప్పాడు. అలాగే అరవింద్ స్వామితో ఢిల్లీ కుమార్ నటిస్తాడా అన్న ప్రశ్నకు.. కథ, పరిస్థితి కుదిరితే తప్పకుండా నటిస్తాను. అయితే ఆయనతో నటించే అవకాశం ఇంకా రాలేదన్నారు. మెట్టి ఓలి సీరియల్‌లో క్యారెక్టర్ యాక్టర్ ఢిల్లీ కుమార్ చాలా ముఖ్యమైన తండ్రి పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు.