కరోనా పరిస్థితుల కారణంగా నితిన్‌, నబా నటేష్, తమన్నా నటించిన 'మాస్ట్రో' సినిమా ఓటీటీలో రిలీజైనా.. సూపర్ డూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ మూవీ అంధుదాన్‌ రీమేక్. ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో నటించి మరోసారి విమర్శకులను సైతం మెప్పించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రతి నాయకురాలి పాత్రలో తమన్నా నటన అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ సినిమా చూసిన మేర్లపాక గాంధీ కూతురు తమన్నాని విలన్‌ రోల్‌లో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ''తమన్నా మైండ్‌ సెట్‌ను మార్చేశారని, ఆమె ఎందుకు అందరినీ చంపుతోంది?'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హీరో నితిన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. షేర్‌ చేసిన వీడియో కింద ''తమన్నా ఏంటి ఇది... నీ ఫ్యాన్స్‌ను ఎందుకు ఏడిపిస్తున్నావు, నేను ఈరోజు చూసిన వీడియోల్లో ఇది ఎంతో క్యూట్‌గా ఉంది, గాంధీ చిన్న కుమార్తె మీకు పెద్ద ఫ్యాన్'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ డిజిటల్‌ వేదికగా రిలీజైన మాస్ట్రో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితే బాగుండని చాలా మంది సినిమా అభిమానులు అనుకుంటున్నారు.

అంజి

Next Story