షాకింగ్ న్యూస్ చెప్పిన మెహరీన్.. మేం విడిపోతున్నాం
Mehreen Pirzada cansalation her engagement Bhavya Bishnoi.టాలీవుడ్ నటి మెహరీన్ పిర్జాదా షాకింగ్ న్యూస్ చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 6:00 PM ISTటాలీవుడ్ నటి మెహరీన్ పిర్జాదా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లో నిశ్చితార్థం వేడుక ఎంతో ఘనంగా జరిగింది. గత నెల పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జంట కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి వాయిదా పడటంతో మెహ్రీన్ తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని అని అందరూ భావిస్తుండగా.. తన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు ప్రకటించి మెహ్రీన్ అందరికి షాక్ ఇచ్చింది.
తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విటర్ వేదికగా మెహరీన్ స్వయంగా లేఖ ద్వారా వెల్లడించింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. నా వ్యక్తిగత విషయాన్నీ అందరు గౌరవిస్తారని అనుకుంటున్నాను.. ప్రస్తుతం కమిట్ అయినా సినిమాలను పూర్తిచేయడంపై ఫోకస్ చేస్తున్నాను. ఇకపై సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టనున్నట్లు ఆమె తెలిపింది.
'భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్‌పై దృష్టి పెట్టానుకుంటున్నా' అంటూ ట్వీట్ చేసింది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
అయితే మెహ్రీన్ అకస్మాత్తుగా ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకోవడానికి అసలు కారణం తెలియలేదు. భవిష్యత్తులో మెహ్రీన్ స్పందించి నిశ్చితార్థం రద్దుకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు.