ఆక‌ట్టుకుంటున్న 'గాడ్సే' టీజర్

Megastar launches Godse Teaser.యంగ్ హీరో స‌త్య దేవ్ న‌టిస్తున్న చిత్రం గాడ్సే. గోపి గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 7:35 AM GMT
ఆక‌ట్టుకుంటున్న గాడ్సే టీజర్

యంగ్ హీరో స‌త్య దేవ్ న‌టిస్తున్న చిత్రం 'గాడ్సే'. గోపి గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ స‌ర‌స‌న మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి న‌టిస్తోంది. ఈ చిత్రంతోనే ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం అవుతున్నారు. సామాజిక అంశాల చుట్టూ ఈ చిత్ర క‌థాంశం తిరుగుతుంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ లింక్ చేస్తూ.. హీరో స‌త్య‌దేవ్‌, ద‌ర్శ‌కుడు గోపి, చిత్ర నిర్మాత సి క‌ళ్యాణ్‌ల‌ను చిరంజీవి అభినందించారు.

ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అంటూ టీజర్ ప్రారంభం అయ్యింది. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు అంటూ స‌త్య‌దేవ్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది.

Next Story
Share it