కళ్యాణ్‌ బాబుకి ఈ బర్త్‌డే వెరీస్పెషల్.. విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

సెప్టెంబర్ 2వ తేదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2024 10:46 AM IST
కళ్యాణ్‌ బాబుకి ఈ బర్త్‌డే వెరీస్పెషల్.. విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

సెప్టెంబర్ 2వ తేదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అయినతర్వాత వచ్చిన ఫస్ట్‌ బర్త్‌డే కావడంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్‌కు స్పెషల్‌ విషెస్‌ చెప్పారు.ఈసారి జరుపుకొంటున్న జన్మదిన వేడుకలు పవన్‌ కళ్యాణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఎక్స్‌ వేదికగా స్పెషల్‌ విషెస్‌ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణిస్తూ.. అంచలంచెలుగా ఎదగాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాంక్షించారు. చిరంజీవి తన ఎక్స్ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చారు. 'కళ్యాణ్‌ బాబు.. ప్రతి ఏడాది నీకు పుట్టిన రోజు వస్తూ ఉంటుంది. కానీ.. ఈ పుట్టిన రోజు వెరీ స్పెషల్. ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. చేస్తావనే నమ్మకంతో నాతో పాటు ఆంధ్ర ప్రజలందరిలోనూ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్‌ భవ.. ' అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌తో ఉన్న ఒక పాత ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టును లైక్‌ కొడుతూ అభిమానులు పవన్‌కు విషెస్‌ చెప్తున్నారు.



Next Story