ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట‌.. ఫోటోలు వైర‌ల్‌

Megastar Chiranjeevi thrown party to team Vikram team.లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన చిత్రం విక్ర‌మ్‌. లోకేష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2022 12:14 PM IST
ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట‌.. ఫోటోలు వైర‌ల్‌

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన చిత్రం 'విక్ర‌మ్‌'. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఇప్ప‌టికే రూ.200కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. చాలా కాలం త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల నుంచి సినీ ప్ర‌ముఖుల వ‌ర‌కు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ని సైతం ఈ చిత్రం ఆక‌ట్టుకుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందాన్ని త‌న ఇంటికి ఆహ్వానించారు చిరు. విక్ర‌మ్ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా క‌మ‌ల్‌హాస‌న్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్‌ను చిరంజీవి స‌త్క‌రించారు. అనంత‌రం చిత్ర‌బృందానికి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఇదే పార్టీలో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ సైతం సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

'నా ప్రియ‌ స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్‌హాసన్‌తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. వాట్ ఏ థ్రిల్లింగ్ ఫిల్మ్‌. మై ఫ్రెండ్‌.. నువ్వు మ‌రింత శ‌క్తిమంతం కావాల‌ని కోర‌కుంటున్నా. 'అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం చిరంజీవి 'గాడ్‌ఫాద‌ర్' లో న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Next Story