ఐకాన్‌స్టార్‌కి మెగాస్టార్ స్పెష‌ల్ విషెస్‌

Megastar Chiranjeevi special birthday wishes to Allu Arjun.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ రోజు. బ‌న్నీ నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 9:00 AM GMT
ఐకాన్‌స్టార్‌కి మెగాస్టార్ స్పెష‌ల్ విషెస్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ రోజు. బ‌న్నీ నేడు 40వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఐకాన్ స్టార్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న మేల్లుడికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. 'జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో' అని చిరు అన్నారు.

ఇక అల్లు అర్జున్ ఈ పుట్టినరోజు వేడుకను తన కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా యూరప్‌లో జరుపుకోబోతున్నాడు. ఈరోజు అక్కడికి వెళుతూ ఫ్యామిలీతో పాటుగా ఏయిర్‌పోర్ట్‌లో మీడియావారికి కనిపించాడు బన్నీ. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. యూరప్ నుంచి తిరిగి రాగానే పుష్ప: ది రూల్ మూవీ షూటింగ్ లో బ‌న్నీ పాల్గొనున్నాడు.

Next Story
Share it