కేరళకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్

కేరళలో ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది బలయ్యారు. ఈ క్రమంలోనే కేరళకు సహాయంతో టాలీవుడ్ హీరోలు అండగా నిలుస్తూ ఉన్నారు.

By అంజి  Published on  4 Aug 2024 6:15 PM IST
Chiranjeevi, Ram Charan , Wayanad landslide relief fund, Kerala

కేరళకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్ 

కేరళలో ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది బలయ్యారు. కేరళకు సహాయంలో టాలీవుడ్ హీరోలు నిలుస్తూ ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాయనాడ్ కొండచరియల బాధితుల సహాయానికి 25 లక్షలు ప్రకటించగా.. మెగా స్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా భారీ సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చారు. కేరళ సీఎం సహాయ నిధికి మెగా స్టార్, మెగా పవర్ స్టార్ కోటి రూపాయలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి X లో కేరళలో జరిగిన విషాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి తెలిపారు. తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి, చరణ్‌ తెలిపారు. జల ప్రళయం వల్ల నష్టపోయి బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని, ఆ శక్తి దేవుడు వారికి అందించాలని ప్రార్థస్తున్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఈ కష్ట సమయంలో తన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ''వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం వల్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎప్పుడూ నాకు చాలా ప్రేమను పంచుతోంది. పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను.'' అని బన్నీ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Next Story