నా బ్లడ్ బ్రదర్స్.. ఇక లేరనే వార్త హృదయాన్ని కలచివేసింది : చిరంజీవి
Megastar Chiranjeevi emotional tweet about fans dead.మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు(ఫ్యాన్స్) ఇద్దరిని కరోనా మహమ్మారి బలిగొంది.
By తోట వంశీ కుమార్
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు(ఫ్యాన్స్) ఇద్దరిని కరోనా మహమ్మారి బలిగొంది. కదిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కు వెంకటరమణ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్‌రెడ్డి చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను నడిపించారు. ఆయన ఇక లేడన్న విషయం తెలిసిన మెగా హీరోలు సోషల్ మీడియా ద్వారా అతడికి సంతాపం ప్రకటించారు.
ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/m2GxwqSjQA
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
వారిద్దరితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన చిరంజీవి.. ఆవేదనతో కూడిన కామెంట్ జతచేశారు. ''ఎంతో కాలంగా అభిమానులు అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్.. కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డిగారు హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనాబారిన పడి ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి'' అని రాశారు.
ఇక మెగా బ్రదర్ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. 'ఊహ తెలిసినప్పటి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా వ్యవహరించేవాడని అతడి గొప్పతనాన్ని వివరించాడు. మన కులం - అభిమాన కులం... మన మతం - సేవామతం.. అని నిస్వార్థంగా పని చేశాడని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి మరణం కలచి వేసిందని ఉద్విగ్నతకు లోనయ్యాడు. వ్యక్తిగతంగా కూడా ప్రసాద్ ప్రతి చిన్న విషయాన్ని తనతో పంచుకునేవాడని గత జ్ఞాపకాల స్మృతులను తడుముకున్నాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ.. అతని భార్య, పిల్లలకు తాము, తమ అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని' రాసుకొచ్చాడు.