ఆకాశాన్ని అలా బంధించిన మెగాస్టార్.. వీడియో వైరల్
Megastar Chiranjeevi captured the rising sun in home quarantine.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి బారిన
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2022 6:36 AM GMT
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న చిరు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. జనవరి 29న చిరు అమ్మగారు అంజనాదేవి పుట్టిన రోజు. అయితే.. ప్రతి సంవత్సరం తన మాతృమూర్తి పుట్టిన రోజును దగ్గరుండి మరీ ఘనంగా జరిపించే మెగాస్టార్ ఈ సారి మాత్రం సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు.
క్వారంటైన్‌లో ఖాళీగా ఉన్న చిరు తనలోని కళలను బయటకు తీసుకువస్తున్నారు. ఫోటోగ్రఫితో పాటు కలానికి పని చెప్పారు. ఉదయాన్నే ఉదయయించే సూర్యుడి తన కెమెరాతో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
'ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో ఉన్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది' అంటూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిపై నెటీజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు నటించిన 'ఆచార్య' చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిరు ప్రస్తుతం'భోళా శంకర్', 'గాడ్ ఫాదర్', కే.ఎస్ రవీంద్ర, వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రాల్లోనూ నటిస్తున్నారు.