పుష్పరాజ్ కు మెగా విషెస్

Mega star Chiranjeevi wishes to Pushpa team.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన‌ చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 10:49 AM IST
పుష్పరాజ్ కు మెగా విషెస్

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన‌ చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (డిసెంబ‌ర్ 17)న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో పుల్ బిజీగా ఉంది. అన్ని ప్రముఖ ప‌ట్ట‌ణాల్లో త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం తాము ప‌డిన క‌ష్టాన్ని వివ‌రిస్తున్నారు. దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం మేకప్ కోసం కేటాయించాల్సి వ‌చ్చేద‌న్నారు. ఉద‌యం 4.30గంట‌ల‌కు నిద్ర‌లేచి.. 5 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు మేక‌ప్ కోస‌మే ఓపిగ్గా కూర్చోవాల్సి వ‌చ్చేద‌ని.. ఆ రోజు షూటింగ్ ముగిసాక ఆ మేక‌ప్ తీయ‌డానికి మ‌రో 20 నుంచి 40 నిమిషాలు ప‌ట్టేద‌న్నారు.

ఇక రేపు ఈ చిత్రం ఐదు బాష‌ల్లో విడుద‌ల కానుండ‌గా.. చిత్ర బృందానికి విషెస్ తెలియ‌జేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గుడ్ లక్ 'పుష్ప' టీం.. మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, గుండె, ఆత్మను ఉంచారు. మీ ప్రయత్నాలన్నీ హృదయపూర్వకంగా అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను. డియర్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేశారు.

Next Story