మ‌నంద‌రి జీవ‌న గ‌మ‌నానికి అదే తార‌క‌మంత్రం : చిరంజీవి

Mega star Chiranjeevi wishes on Ram Navami.శ్రీరాముడి జీవితం మ‌నంద‌రి జీవ‌న గ‌మ‌నానికి తార‌క‌మంత్రం అని మెగాస్టార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 5:32 AM GMT
మ‌నంద‌రి జీవ‌న గ‌మ‌నానికి అదే తార‌క‌మంత్రం : చిరంజీవి

శ్రీరాముడి జీవితం మ‌నంద‌రి జీవ‌న గ‌మ‌నానికి తార‌క‌మంత్రం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హ‌నుమంతుడికి ప‌ర‌మ భ‌క్తుడైన చిరంజీవి నేడు(ఆదివారం) శ్రీరామ న‌వ‌మిని పురస్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిజేశారు. అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు! ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా,రాజు గా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం అని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్‌తో పాటు సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, అన‌సూయ‌, సుధీర్ బాబు త‌దిత‌రులు రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలియజేశారు.
Next Story
Share it