మిష‌న్ మొద‌లైంది.. ఆక్సిజ‌న్ దొర‌క్క చనిపోయార‌నే వార్త‌లు ఇక విన‌కూడ‌దు

Mega Star Chiranjeevi launches oxygen banks. తాజాగా.. చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్‌లు లాంచ్ అయ్యింది. కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 10:41 AM IST
Chiranjeevi oxygen banks

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఆస్ప‌త్రుల‌న్ని దాదాపుగా కరోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. అయితే.. ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో ప‌లువురు మృతి చెందిన ఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రాణ వాయువు అంద‌క ఎవ‌రూ చ‌నిపోకూడ‌ద‌నే సంక‌ల్పంతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప‌నులు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఆధ్వర్యంలో శరవేగంగా జ‌రిగాయి.

తాజాగా.. చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్‌లు లాంచ్ అయ్యింది. కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ స‌న్ ట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణ‌లోని ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు రేప‌టి నుంచి అందుబాటులోకి వస్తాయ‌ని తెలిపారు.

'ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదనే ఆశ‌యంతో చిరంజీవి ఈ మ‌హ‌త్తర కార్యాన్ని మొద‌లు పెట్టారు. అయితే ఇది నేటి నుండి మొద‌లు కానుండ‌డంతో చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేస్తూ.. మిష‌న్ మొద‌లైంది. ఇక ఆక్సిజ‌న్ దొర‌క్క చనిపోయార‌నే వార్త‌లు మ‌నం విన‌కూడ‌దు అంటూ' చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


Next Story