ఘ‌నంగా హీరో కార్తికేయ పెళ్లి.. హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి

Mega star Chiranjeevi attended Tollywood actor Kartikeya Marriage.టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడు అయ్యాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 7:52 AM GMT
ఘ‌నంగా హీరో కార్తికేయ పెళ్లి.. హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడు అయ్యాడు. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు తాను ప్రేమించిన అమ్మాయి లోహిత మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో వీరి వివాహా వేడుక జ‌రిగింది. ఈ వేడ‌క‌కు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, అజ‌య్ భూప‌తి, త‌ణికెళ్ల భ‌ర‌ణి, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. కార్తికేయ పెళ్లి ఫోటోలు కొన్ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా మారాడు కార్తీకేయ‌. పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. దీంతో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు కార్తీకేయ‌. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన చిత్రం 'రాజా విక్ర‌మార్క' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం మిశ్ర‌మ స్పంద‌న‌ను అందుకుంది. బీటెక్ చ‌దివే రోజుల్లో కార్తికేయ‌కు లోహిత ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఆగ‌స్టులో నిశ్చితార్థం చేసుకున్న వీరు నేడు పెళ్లితో ఒక్క‌టైయ్యారు.

Next Story
Share it