'కొండ పొలం' పై చిరంజీవి స్పంద‌న ఏంటంటే..?

Mega star Chiranjeevi Apreciated Konda Polam team.వైవిధ్య‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ క్రిష్‌. వైష్ణవ్ తేజ్ హీరోగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2021 11:42 AM IST
కొండ పొలం పై చిరంజీవి స్పంద‌న ఏంటంటే..?

వైవిధ్య‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ క్రిష్‌. వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'కొండ‌పొలం'. వెంక‌ట‌రామిరెడ్డి రాసిన కొండ‌పొలం న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కీర‌వాణి సంగీతాన్ని అందించ‌గా.. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో వైష్ణ‌వ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టించింది. నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కాగా.. ఈ చిత్ర ప్రీమియ‌ర్ షోను నిన్న సాయంత్రం చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిల‌కించారు.

'కొండ‌పొలం' చిత్రాన్ని ఇప్పుడే చూశాన‌ని.. త‌న‌కు ఈ చిత్రం చాలా బాగా న‌చ్చింద‌ని చిరంజీవి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మంచి సందేశంతో కూడిన అంద‌మైన గ్రామీణ ప్రేమ‌క‌థ ఇది. క్రిష్ చిత్రాలు అంటే డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ చిత్రాన్ని చూసిన వారు చాలా థ్రిల్‌కు లోన‌వుతారు. ఇక న‌టీన‌టుల నుంచి మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకునే స‌త్తా ఆయ‌న‌కు ఉంది. తప్పకుండా ఈ చిత్రం ఎన్నో ప్రశంసలతో పాటు మ‌రెన్నో అవార్డులు గెలుచుకుంటుందని' చిరంజీవి ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌కు క్రిష్ ధన్యవాదాలు తెలియ‌జేశారు. 'చిరంజీవి సార్.. 'కొండపొలం' సినిమాపై మీరిచ్చిన రివ్యూ నాకు వెలకట్టలేనిది. మీ హృదయ పూర్వకమైన పలుకులు, ప్రశంస, ఆదరణకు నా కృతజ్ఞతలు' అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

Next Story