నాగబాబుకు చేతికి గాయం.. నొప్పిని తగ్గిస్తానన్న నిహారిక.. వీడియో వైరల్
Mega Brother Nagababu Shares Funny Video With his daughter Niharika Konidela.కొణిదెల నాగబాబు చేతికి గాయమైంది
By తోట వంశీ కుమార్ Published on 23 Sept 2022 1:32 PM ISTమెగా బ్రదర్ కొణిదెల నాగబాబు చేతికి గాయమైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఆయన తన కుడి చేతికి కట్టు వేసుకుని కనిపించారు. ఆయన చేయి ఫ్యాక్షర్ అయినట్లు తెలుస్తోంది. దీనిని చూసిన ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ గాయం ఎలా అయ్యిందనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఆయనకు ఏమైందా..? అని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆ వీడియోలో నాగబాబు పక్కనే కూర్చున్న కూతురు నిహారిక అల్లరి చేస్తోంది. తండ్రి గడ్డాన్ని నిమురుతూ "నాన్న నొప్పిగా ఉందా నాన్నా.. నీ నొప్పిని నేను తగ్గిస్తాను నాన్న" అని అనగా.. "పెద్ద పెద్ద డాకర్ట్స్ వల్లే కాలేదు. నీ వల్ల ఏమౌతుందని "నాగబాబు అన్నాడు. "నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా" అంటూ నీహరిక తండ్రి నాగబాబు చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పిని భరించలేక నాగబాబు ఒక్కసారిగా అరిచాడు. ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో నాగబాబు షేర్ చేస్తూ.. "ముల్లును ముల్లుతోనే తియాలి అంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ట్రై చేయకండి. నిపుణురాలు డా.నిహారిక పర్యవేక్షణలో జరిగింది "అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగబాబు, ఆయన గారాల పట్టి నిహారిక ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకూతుళ్లైనప్పటికీ స్నేహితుల్లా ఎంతో సరదాగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.