నిహారికతో ఇప్పుడు మాటలు తగ్గాయన్న నాగబాబు
Mega brother Nagababu interesting comments on Niharika.మెగా బ్రదర్ నాగబాబుకు తన కూతురు నిహారికతో ఇప్పుడు మాటలు తగ్గాయన్న నాగబాబు.
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2021 1:24 PM ISTమెగా బ్రదర్ నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఇటీవలే నిహారిక పెళ్లిని చాలా ఘనంగా చేశారు నాగబాబు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు మెగాబ్రదర్. అయితే.. ఇన్నాళ్లు తన కూతురితో ప్రతిరోజు అన్ని విషయాలపై మాట్లాడే నాగబాబు.. ఆమె పెళ్లి జరిగిన తర్వాత మాత్రం ఆమెతో అంతగా మాట్లాడలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు కొడుకు వరుణ్‌తేజ్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు ఆడపిల్లంటే చాలా ఇష్టమని.. ఈ సృష్టికి వారే మూలం అని.. అందుకే వారిపై ఎనలేని గౌరవం అని చెప్పారు నాగబాబు. వరుణ్‌బాబు పుట్టిన తరువాత ఒక కూతురు పుడితే బాగుందని అనుకున్నానని.. తాను కోరుకున్నట్లే నిహారిక జన్మించిందన్నారు. తనకు నిహారిక అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. తనకు సంబంధించిన చాలా విషయాలను ఆమెతో చెప్పేవాడినని తెలిపారు. తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పడానికి మాటలు కూడా సరిపోవన్నారు. అయితే.. నిహారిక పెళ్లి తరువాత ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయని.. అయినప్పటికి తన కూతురు కొత్త జీవితంలోకి అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇక వరుణ్‌తేజ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ కొంతమంది స్నేహితుల వద్ద మాత్రమే ఓపెన్‌గా ఉంటాడని, జనాల్లోకి వెళితే చాలా సైలెంట్‌గా ఉంటాడని చెప్పారు. వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకుంటాడా లేక పెద్దలు కుదిర్చిన వివాహాం చేసుకుంటాడా అన్న ప్రశ్నకు.. అదేమీ ముఖ్యం కాదని.. అర్థం చేసుకునే భాగస్వామి రావాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు.