'మీట్‌క్యూట్‌' టీజర్‌.. భావోద్వేగాల స‌మ్మేళ‌నం

Meet Cute Teaser Emotional Rollercoaster.నేచుర‌ల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రో వైపు నిర్మాత‌గా ప‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 12:56 PM IST
మీట్‌క్యూట్‌ టీజర్‌.. భావోద్వేగాల స‌మ్మేళ‌నం

నేచుర‌ల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రో వైపు నిర్మాత‌గా ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ చిత్రాల‌ను నిర్మిస్తూ కొత్త దర్శకులను చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. తాజాగా 'మీట్ క్యూట్' అనే ఓ వెబ్ సిరీస్‌ను నాని నిర్మించాడు. ఈ సిరీస్‌కు నాని సోద‌రి దీప్తి ఘంటా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం.

కాగా.. ఈమె గ‌తంలో 'అనగనగా ఒక నాన్న' అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మీట్ క్యూట్‌తో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. తాజాగా ఈ సిరీస్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఐదు భిన్న కథల ఆంథాలజీ నేపథ్యంలో తెర‌కెక్కిన‌ట్లు టీజర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఐదు మీటింగ్స్‌లో పరిచయం లేని ఇద్దరిద్దరు వ్యక్తులు అనుకోకుండా కలుసుకొని తమ తమ అభిప్రాయాలు, వ్యక్తిత్వాల గురించి తెలుసుకున్నట్లు టీజ‌ర్‌లో క‌నిపిస్తోంది.

సీనియర్ నటులు సత్యరాజ్ నుంచి రుహాణి శర్మ, ఆదా శర్మ, వర్షబొల్లమ్మ, సునైనా ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, అశ్విన్ కుమార్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఎప్ప‌టి నుంచి అదేని ఇంకా తెలప‌లేదు.

Next Story