దక్షిణకొరియా రాయబారికి చిరంజీవి తేనీటి విందు..ఫొటోలు ట్వీట్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి.. భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జెబోక్‌తో సమావేశం అయ్యారు. తన ఇంట్లో వారికి తేనీటివిందు

By Srikanth Gundamalla  Published on  17 Jun 2023 1:01 PM IST
Chiranjeevi, high Tea, South Korea Ambassador, Ramcharan, Hyderabad

దక్షిణకొరియా రాయబారికి చిరంజీవి తేనీటి విందు..ఫొటోలు ట్వీట్ చేసిన మెగాస్టార్ 

మెగాస్టార్‌ చిరంజీవి.. భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జెబోక్‌తో సమావేశం అయ్యారు. తన ఇంట్లో వారికి తేనీటివిందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. దక్షిణ కొరియా రాయబారిని కలవడం సంతోషంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌.. మెగా ఇమేజ్‌ను దాటి గ్లోబల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కు రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరుఫున ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలోనే కొరియన్‌ ఎంబసీ మెంబర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్‌ వేసి చరణ్ సందడి చేశాడు.

అదే విషయాన్ని గుర్తు చేస్తూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. జీ20 సమ్మిట్ లో చరణ్ కలిసి నాటు నాటు స్టెప్ వేసిన దగ్గర నుంచి చాంగ్ జెబోక్ ని కలవాలి అనుకుంటున్నట్లు, అది ఇప్పుడు కుదిరిందని చెప్పారు. దక్షిణ కొరియా అద్భుతమైన ప్రదేశమని ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అక్కడి సంస్కృతి, మన సంస్కృతులు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పారు. ఆహారం, సంగీతం, సినిమాల పట్ల మనకున్న ప్రేమ మాత్రమే కాదు.. కె-పాప్, కె-డ్రామాలు ఇప్పటికే ఇండియన్ ఆడియెన్స్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని అన్నారు. ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా దక్షిణ కొరియాలో అడుగుపెట్టుబోతున్నాయని చెప్పారు. ఇది సంతోషతగ్గ విషమన్నారు చిరంజీవి. తేనీటి విందులో రామ్‌చరణ్‌ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హై టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' చిత్రంలో నటిస్తున్నారు. మెహర్‌ రమేశ్ రూపొందిస్తున్న ఈ మూవీ ఆగస్టులో రిలీజ్‌ కానుంది.

Next Story