'పుష్ప'లో మనోజ్‌ బాజ్‌పాయ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో

Manoj bajpayee clarifies rumours about acting in pushpa sequel. తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఎంతగానో సుపరిచితం. 'ప్రేమకథ', 'హ్యాపీ', 'కొమరంపులి',

By అంజి  Published on  22 July 2022 1:24 PM IST
పుష్పలో మనోజ్‌ బాజ్‌పాయ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఎంతగానో సుపరిచితం. 'ప్రేమకథ', 'హ్యాపీ', 'కొమరంపులి', 'వేదం' వంటి మూవీస్‌తో టాలీవుడ్‌లో మనోజ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సిరీస్‌ ఇండియా వైడ్‌గా ఫాలోయింగ్‌ పెంచుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సీక్వెల్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడని నెట్టింట వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మనోజ్‌ బాజ్‌పాయ్‌ క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాసిల్‌ నటించిన 'పుష్ప: ది రైజ్‌' బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమా రెండో పార్ట్‌ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే 'పుష్ప2: ది రూల్‌' కోసం మనోజ్ బాజ్‌పాయ్‌ని చిత్రయూనిట్‌ సంప్రదించినట్లు, పుష్పలో మనోజ్‌కు పోలీసు అధికారి పాత్రను ఆఫర్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మనోజ్ బాజ్‌పాయ్‌ స్పందిస్తూ.. మీకు ఇలాంటి వార్తలు ఎక్కడి నుండి వస్తాయి? అని ప్రశ్నించాడు. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని మనోజ్‌ ఒక న్యూస్ పోర్టల్‌కి తెలిపారు.

పుష్ప సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ను దర్శకుడు సుకుమార్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు నుండి షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్'లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ పాత్రల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. ఇదిలా ఉంటే సౌత్‌ సినిమాల్లో పనిచేయడం గురించి మనోజ్‌బాజ్‌పాయ్‌ను అడగగా ''ఇంతకు ముందు సౌత్‌ సినిమాల్లో పని చేశానని, ఎప్పటి నుంచో మంచి కథల వెతుకుతున్నాను'' అని తెలిపాడు.

Next Story