మంగ్లీ న్యూ లుక్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌.. ఆ షో కోస‌మేనా..!

Mangli New look goes viral.తీన్మార్ తో పరిచయమై.. ఆపై పలు పాటలతో ఆకట్టుకున్న మంగ్లీ గురించి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 2:02 AM GMT
మంగ్లీ న్యూ లుక్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌.. ఆ షో కోస‌మేనా..!

తీన్మార్ తో పరిచయమై.. ఆపై పలు పాటలతో ఆకట్టుకున్న మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాటలతో పాటు పలు టీవీ షోలలోనూ కనిపించిన ఈమె.. ప్రస్తుతం సినీ నేపథ్య గాయనిగా పాటలు పాడుతున్నది. పాట‌ల‌తో ల‌క్షాలాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. యూనిక్ వాయిస్‌తో మంచి సింగ‌ర్‌గా దూసుకుపోతున్న మంగ్లీ ఎప్పుడు ట్రెడిష‌న‌ల్ లుక్‌లోనే క‌నిపిస్తూ ఉండేది. అయితే.. ప్ర‌స్తుతం మంగ్లీ కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

త‌న డ్రెస్‌సైజ్‌ను కాస్త త‌గ్గించి అభిమానుల‌కు పెద్ద షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మంగ్లీ ఇలా ఎప్పుడు కనిపించ‌లేదు. దీంతో మంగ్లీ బిస్‌బిస్‌లో పాల్గొనేందుకే ఇలా త‌న డ్రెస్సింగ్ స్టైల్ మార్చింద‌ని అంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొంటోందనే ప్రచారం ఉంది. బిగ్‌బాస్ 4 కోసం కూడా మంగ్లీ పేరు వినిపించిన‌ప్ప‌టికీ.. ఆమె ఆ సీజ‌న్‌లో పాల్గొన‌లేదు. ఇక ఈ సీజ‌న్ కోసం ఆమెను తీసుకొచ్చేందుకు నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికి అమ్మ‌డి న్యూ లుక్ అభిమానుల్లో అనేక అనుమానాలను క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్న ఆమె.. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అడుగుపెడుతుందా అన్న సందేహాలు లేక‌పోలేదు. కాగా.. దీనిపై మంగ్లీ ఓ క్లారిటీ ఇస్తే త‌ప్ప ఇందులో నిజం ఎంత ఉందో మాత్రం తెలియ‌దు.

Next Story