మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. అంటున్న శ‌ర్వా

Mangalyam Lyrical Song release from Aadavallu Meeku Joharlu.యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 9:37 AM GMT
మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. అంటున్న శ‌ర్వా

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ‌ర్వా స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, పాట‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం నేడు మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది.

'మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా.. మమ జీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా..' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట‌ను బాలీవుడ్ సింగ‌ర్ జస్ప్రీత్ జాస్ పాడ‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ మంచి బీట్‌ను అందించారు. ఇక ఈ పాట‌లో శ‌ర్వా వేసిన స్టెప్పులు సాంగ్‌కి ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచాయి. సీనియర్‌ నటి ఖుష్బూ, రాధికా శరత్‌ కుమార్, ఊర్వశి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం మార్చి 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it