న‌టి మందిరా బేడి ఇంట విషాదం

Mandira Bedi husband Raj Kaushal Passed away.ప్రముఖ మాజీ క్రికెట్‌ కామెంటేటర్‌, నటి మందిరా బేడీ ఇంట విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 10:25 AM IST
న‌టి మందిరా బేడి ఇంట విషాదం

ప్రముఖ మాజీ క్రికెట్‌ కామెంటేటర్‌, నటి మందిరా బేడీ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె భ‌ర్త రాజ్ కౌశ‌ల్ క‌న్నుమూశారు. బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో ఆయ‌న తుది శ్వాస విడిచిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్ కౌశ‌ల్ నటుడు, డైరెక్టర్‌, నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'ప్యార్ మే క‌బీ క‌బీ', 'షాదీ కా ల‌డ్డు' వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. రాజ్ కౌశ‌ల్ మృతిపై బాలీవుడ్ వ‌ర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయాన్ని మరో దర్శకుడు ఓనిర్‌ ట్విట్టర్‌లో పంచుకున్నారు. రాజ్‌ కుశల్‌ మృతికి ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా మై బ్రదర్‌ నిఖిల్‌కు ఓ నిర్మాతగా వ్యవహరించారు. తనను ఎంతో సపోర్ట్‌ చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు.

మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు మ‌న్మ‌థుడు, ప్ర‌భాస్ సాహో చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

Next Story