'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైల్‌పై తొలి సంతకం
Manchu Vishnu takes Oath as Maa President.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు
By తోట వంశీ కుమార్ Published on
13 Oct 2021 7:08 AM GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకాన్ని చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. వారి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది. వారి స్థానాలను భర్తీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు.
Next Story