'మా' ఎన్నికలు.. మంచు విష్ణు ప్యానల్ ఇదే
Manchu Vishnu announced his Pannel.గతకొద్ది టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్
By తోట వంశీ కుమార్ Published on 23 Sept 2021 6:06 AMగతకొద్ది టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావు వంటి వారు ఉండడంతో మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. వీరిలో ప్రకాశ్ రాజ్ ఓ అడుగు ఇప్పటికే ముందుకు వేసి ఎప్పుడో తన ప్యానల్ సభ్యులు ప్రకటించి.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు. కాగా నేడు(గురువారం) మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు.
మంచు విష్ణు ప్యానల్ ఇదే..
1.మంచు విష్ణు - అధ్యక్షుడు
2.రఘుబాబు - జనరల్ సెక్రటరీ
3.బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
4.మధాల రవి - వైస్ ప్రెసిడెంట్
5.పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్
6.శివబాలాజీ - కోశాధికారి
7.కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
8.గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
9.అర్చన
10.అశోక్‌కుమార్
11.గీతాసింగ్
12.హరినాథ్‌బాబు
13.జయవాణి
14.మలక్‌పేట్ శైలజ
15.మాణిక్
16.పూజిత
17.రాజేశ్వరీ రెడ్డి
18.సంపూర్ణేశ్ బాబు
19.శశాంక్
20.శివన్నారాయణ
21.శ్రీలక్ష్మి
22.శ్రీనివాసులు
23.స్వప్నా మాధురి
24.విష్ణు బొప్పన
25.వడ్లపట్ల
For my MAA, our privilege and honor 🙏 pic.twitter.com/Ow3Cdrvsec
— Vishnu Manchu (@iVishnuManchu) September 23, 2021