మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు ఊరట

Manchu Mohan Babu's family gets relief in AP High Court. ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు కుటుంబానికి ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది.

By Medi Samrat
Published on : 19 Sept 2022 5:15 PM IST

మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు ఊరట

ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు కుటుంబానికి ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. మంచు మోహ‌న్ బాబు, ఆయ‌న ఇద్ద‌రు కుమారులు మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ల‌పై తిరుప‌తి కోర్టులో ఓ కేసు విచార‌ణ సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మోహ‌న్ బాబు త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి ధ‌న్నాకు దిగారు. ఈ వ్య‌వ‌హారంపై మోహ‌న్ బాబు, ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌పై తిరుప‌తి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విచార‌ణ తిరుప‌తి కోర్టులో సాగుతోంది. ఈ విచార‌ణ‌ను నిలుపుద‌ల చేయాలంటూ మోహ‌న్ బాబు ఇటీవ‌లే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు తిరుప‌తి కోర్టులో కేసు విచార‌ణ‌ను 8 వారాల పాటు నిలుపుద‌ల చేసింది.


Next Story