పిల్లల భద్రతలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: హీరో మనోజ్

సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 9:20 AM IST
manchu manoj, tweet, social media, tollywood,

పిల్లల భద్రతలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: హీరో మనోజ్

సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎక్స్‌ వేదిక ఆయన కోరారు. మరోవైపు ఒక వ్యక్తి ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసిన వ్యక్తికి సీరియస్‌గా హెచ్చరిక చేశారు.

ఎక్స్‌లో పోస్టు పెట్టిన హీరో మంచు మనోజ్... 'చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతో పాటు అసహ్యంగా ఉంది. కామెడీ అనే పేరుతో సోషల్‌ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు. ప్రమాదకరం. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం ఏడాది క్రితమే ఇన్‌స్టాలో ఓ వ్యక్తిని సంప్రదించాను. కానీ.. అతను స్పందించలేదు. అదే వ్యక్తి ఇప్పుడు సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. చర్యలను తీసుకోవాలి. తెలుగురాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని కోరుతున్నా. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులనూ కోరుతున్నా' అని రాసుకొచ్చారు మంచు మనోజ్.

అలాగే ఓ వ్యక్తిని ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను అంటూ ఎక్స్‌ వేదికగా మంచు మనోజ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి దుర్గా తేజ్‌ కూడా పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా క్రూరంగా, భయానకంగా మారిపోయిందని చెప్పాడు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేశారు.

Next Story