మంచు మ‌నోజ్ ట్వీట్‌.. పెళ్లి గురించా..? లేక కొత్త సినిమానా.. ?

Manchu Manoj To Announce Special News.మంచు వారి అబ్బాయి మ‌నోజ్‌ చేసిన ట్వీట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2023 2:25 PM IST
మంచు మ‌నోజ్ ట్వీట్‌.. పెళ్లి గురించా..?  లేక కొత్త సినిమానా.. ?

మంచు వారి అబ్బాయి మ‌నోజ్‌ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రో రెండు రోజుల్లో త‌న జీవితానికి సంబంధించిన ఓ ప్ర‌త్యేక‌మైన వార్త‌ను పంచుకుంటాన‌ని బుధ‌వారం మంచు మ‌నోజ్ చెప్పాడు. అది ఏమైఉంటుందా అని అత‌డి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

"నా హృద‌యానికి చేరువైన ఓ ప్ర‌త్యేక‌మైన వార్త‌ను గ‌త కొంత‌కాలంగా నాలోనే దాచుకున్నాను. నా జీవితంలో మ‌రో ద‌శ‌లోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను జ‌న‌వ‌రి 20న చెబుతా. ఎప్ప‌టిలాగే మీ అంద‌రి ఆశీస్సులు కావాలి." అని మనోజ్ ట్వీట్ చేశాడు. 'దొంగ దొంగ‌ది' చిత్రంలోని "మ‌న్మ‌థ రాజా" పాట‌కు సంబంధించిన జిప్ వీడియోను మ‌నోజ్ షేర్ చేశాడు.

మ‌నోజ్ చేసిన ట్వీట్‌ను చూసిన నెటీజ‌న్లు ఎవ‌రికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. రెండో పెళ్లి గురించా లేక కొత్త సినిమా గురించా అన్న చ‌ర్చ మొద‌లైంది. అయితే.. ఎక్కువ మంది మాత్రం పెళ్లి గురించే అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. దివంగ‌త భూమా నాగిరెడ్డి- శోభ దంప‌తుల రెండో కూతురు భూమా మౌనిక‌రెడ్డితో మ‌నోజ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వీరిద్ద‌రు సీతాఫ‌ల‌మండిలోని వినాయ‌క మండ‌పాన్ని సంద‌ర్శించ‌డంతో ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. అయితే.. దీనిపై ఈ ఇద్ద‌రూ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. కాగా.. మ‌నోజ్ చెప్పే విష‌యం ఏంటో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story