రెండో పెళ్లిపై స్పందించిన మంచు మ‌నోజ్

Manchu Manoj responds to second marriage news.గ‌త కొద్ది రోజులుగా హీరో మంచు మ‌నోజ్ రెండో వివాహం చేసుకోనున్నాడు అంటూ వార్త‌లుపై మంచు మ‌నోజ్ స్పందించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 3:34 PM IST
Manchu Manoj responds to second marriage news.

గ‌త కొద్ది రోజులుగా హీరో మంచు మ‌నోజ్ రెండో వివాహం చేసుకోనున్నాడు అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అత‌డికి కాబోయే భార్య.. మంచు వారి కుటుంబానికి బాగా ద‌గ్గ‌రి అమ్మాయి అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై మంచు మ‌నోజ్ స్పందించాడు. అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని కాస్త వ్యంగ్యంగా చెప్పాడు. ఇటీవల విడుదల అయిన జాతి రత్నాలు ట్రైలర్‌లోని బ్రహ్మానందం ఫోటోలను తీసుకొని.. పెళ్లి తేదీ, ముహూర్తం ఎక్క‌డ జ‌రుగుతుందో కూడా మీరే చెప్పేయండి అంటూ కొన్ని ఎమోజీలను జోడించారు. మ‌నోజ్ పెట్టిన ట్వీట్‌తో ఆయ‌న పెళ్లి వార్త‌ల్లో ఎటువంటి నిజంలేద‌ని అంటున్నారు.


ఇక 'దొంగా దొంగ‌ది' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు మ‌నోజ్‌. 'వేదం', 'రాజుభాయ్‌', 'పోటుగాడు' సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో ప్రేమించిన ప్ర‌ణ‌తీ రెడ్డిని వివాహాం చేసుకున్నాడు. అయితే.. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఇరువురు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సగం వరకు పూర్తి అయింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.




Next Story