టికెట్ కోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వ‌చ్చింది.. వైర‌ల్‌గా మారిన మంచుల‌క్ష్మి ట్వీట్‌

Manchu Lakshmi says i had to sell kidney to buy Flight Ticket.మంచువార‌మ్మాయి మంచుల‌క్ష్మి గురించి ప్రత్యేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 1:00 PM IST
టికెట్ కోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వ‌చ్చింది.. వైర‌ల్‌గా మారిన మంచుల‌క్ష్మి ట్వీట్‌

మంచువార‌మ్మాయి మంచుల‌క్ష్మి గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. ఓ వైపు సినిమాలు మ‌రో వైపు షోల‌లో ప్రేక్ష‌కుల‌కు చేరువ‌తుతోంది. ఈ మ‌ధ్యే క‌ల‌రి విద్య‌ను కూడా నేర్చుకున్న ల‌క్ష్మి.. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా త‌న కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చిందని మంచు ల‌క్ష్మి చేసిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇన్ని రోజులు కుటుంబంతో గ‌డిపిన ల‌క్ష్మి ఇప్ప‌డు ఫారిన్ టూర్‌కు వెలుతున్న‌ట్లు చెప్పింది. అయితే.. ఎక్క‌డికి వెలుతుంద‌న్న సంగ‌తిని మాత్రం చెప్ప‌లేదు. ' ఇన్ని రోజులు కుటుంబంతో సరదాగా గడిపాను. ఇప్పుడు నా కోసం కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నాను. అందుకే ఒంటరిగా ఫారిన్‌ టూర్‌కు వెళుతున్నాను' అని ట్వీట్ చేసింది.

మ‌రో ట్వీట్‌లో ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్‌ కొనేందుకు నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్‌ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా అంటూ విమానం టికెట్ ధ‌ర‌ల‌పై సెటైరిక‌ల్‌గా రాసుకొచ్చింది.

దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మీరు రిచ్ కదా అక్కా... మీరు కూడా ఇలా చేస్తారా? అని ఒక నెటిజెన్ ప్రశ్నించగా.. 'మా నాన్న రిచ్ తమ్ముడూ... నేను కాదు' అని మంచు ల‌క్ష్మి స‌మాధానమిచ్చింది.

Next Story