ఆస్ప‌త్రిలో స‌మంత అంటూ క‌థ‌నాలు.. స్పందించిన మేనేజ‌ర్‌

Manager Response on Samantha health rumors.స్టార్ హీరోయిన్ స‌మంత ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 11:32 AM IST
ఆస్ప‌త్రిలో స‌మంత అంటూ క‌థ‌నాలు.. స్పందించిన మేనేజ‌ర్‌

స్టార్ హీరోయిన్ స‌మంత ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో మ‌ళ్లీ ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఈ వార్త‌ల‌పై స‌మంత మేనేజ‌ర్ స్పందించారు. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌మంత ఆరోగ్యంగానే ఇంట్లోనే ఉన్నార‌ని తెలిపారు. సోష‌ల్ మీడియాలో స‌మంత ఆరోగ్యం పై వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

తాను వ‌యోసైటిస్ అనే అరుదైన రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌మంత వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ వ్యాధి కార‌ణంగా గురువారం స‌మంత అస్వ‌స్థ‌త‌కు గురైయ్యార‌ని, దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు అని సోష‌ల్ మీడియా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆందోళ‌న చెందిన అభిమానులు స‌మంత త్వ‌ర‌గా కోలువాల‌ని 'గెట్ వెల్ సూన్' సామ్ అంటూ పోస్టులు పెడుతూ స‌మంతను ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సామ్ మేనేజ‌ర్ ఆ వార్త‌ల‌పై స్పందించారు.

ఇక సినిమాల విష‌యాన్ని వ‌స్తే.. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'య‌శోద' చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రానికి హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించారు.

Next Story