ప్రేమలు హీరోయిన్ ను ఇబ్బంది పెట్టిన అభిమానులు

ప్రేమలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైంది నటి మమితా బైజు. 'రెబల్' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి మమితా బైజును చెన్నైలోని ప్రముఖ వీఆర్ మాల్‌కు ఆహ్వానించారు

By Medi Samrat  Published on  3 Jun 2024 8:49 PM IST
ప్రేమలు హీరోయిన్ ను ఇబ్బంది పెట్టిన అభిమానులు

ప్రేమలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైంది నటి మమితా బైజు. 'రెబల్' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి మమితా బైజును చెన్నైలోని ప్రముఖ వీఆర్ మాల్‌కు ఆహ్వానించారు. అక్కడ జరిగిన నగల ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన ఈ నటిని అభిమానులు చుట్టుముట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊహించని విధంగా అందరూ కలిసి చుట్టుముట్టిన కారణంగా ఎంతో టెన్షన్ పడింది. సెక్యూరిటీ కూడా భారీ గుంపును నియంత్రించలేకపోయారు. చివరికి ఎలాగోలా గుంపు నుండి మామితా బయటపడగలిగింది.

'ప్రేమలు' సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది. మమిత బైజు ఒక తమిళ చిత్రం కోసం నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పని చేస్తూ ఉంది. ఇక తెలుగులో 'VD 12' సినిమా కోసం విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతోందనే టాక్ వినిపిస్తూ ఉంది.

Next Story