త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించనున్న 'ప్రేమలు' బ్యూటీ
ప్రేమలు వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 10:45 AM ISTప్రేమలు వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. దినేష్ బాబు దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు-మలయాళం) చిత్రం 'డియర్ కృష్ణ'లో నటిస్తోంది. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.
కేరళలో జరిగిన యదార్థ సంఘటన స్ఫూర్తితో డియర్ కృష్ణ సినిమా చేశాం అన్ని దర్శకుడు దినేష్ బాబు తెలిపారు. 2018లో అక్షయ్ కృష్ణన్ ప్లస్ టూ స్టూడెంట్ కు జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒక ఉన్నత శక్తికి లొంగిపోయినప్పుడు జరిగే అద్భుతాలకు ఈ కథ నిదర్శనం.. దేవుడిని నమ్ముకున్న ఏ వ్యక్తికైనా ఇలాంటి అద్భుతాలు జరగవచ్చు అన్నారు. దినేష్ బాబు అనుభవజ్ఞుడైన ఫిల్మ్ మేకర్. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన కన్నడలో 48 చిత్రాలకు, మలయాళంలో రెండు చిత్రాలకు, తమిళంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో పాపకోసం (1990), భలే మొగుడు భలే పెళ్లాం (2011) అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు 'డియర్ కృష్ణ'ను తెలుగులో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కథలోని సారాంశాన్ని నిలుపుకోవాలనుకున్నాం కాబట్టే ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలనుకోలేదన్నారు. తెలుగులో షూట్ చేస్తే కథకు న్యాయం చేయగలమని నమ్మకం. అందుకే మలయాళ వెర్షన్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి షూట్ చేశాస్తున్నాం అన్ని దినేష్ తెలిపారు.
ఈ చిత్రంలో అక్షయ్ కృష్ణన్ ప్రేయసిగా మమితా బైజు నటించడం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఆమె కథలో ప్రధాన పాత్రలలో ఒకటిగా నటిస్తుంది. ఐశ్వర్య, అవినాష్, సమీర్, శాంతి కృష్ణ మరియు లోహిత్ లతో కలిసి కథను నడిపిస్తుంది అని ఈ చిత్ర స్క్రీన్ రైటర్, డైలాగ్స్ మరియు సినిమాటోగ్రాఫర్ కూడా అయిన దినేష్ తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజజీవితంలో ఆ పరిస్థితిని ఎదుర్కొన్న అక్షయ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషంగా చేపవచ్చు.