అభిమానుల‌కు చేదువార్త‌.. సూప‌ర్‌స్టార్‌కు క‌రోనా

Malayalam superstar Mammootty tests Covid positive.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 4:42 PM IST
అభిమానుల‌కు చేదువార్త‌.. సూప‌ర్‌స్టార్‌కు క‌రోనా

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, మాలీవుడ్ అనే తేడాలేకుండా అంద‌రూ దీని బారిన ప‌డుతున్నారు. తాజాగా మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

'అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నేను నిన్న క‌రోనా బారిన ప‌డ్డాను. కొద్దిపాటి జ్వ‌రం త‌ప్ప బాగానే ఉన్నాను. సంబంధిత అధికారుల సూచ‌న‌ల మేర‌కు ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉన్నాను. మీరంద‌రూ సుర‌క్షితంగా ఉండండి. ఎల్ల‌వేళ‌లా మాస్క్‌ను త‌ప్ప‌క ధ‌రించండి' అని మ‌మ్ముట్టి ట్వీట్ చేశారు. కాగా.. ఈ విష‌యం తెలిసిన అభిమానులు.. మ‌మ్ముట్టి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం సీబీఐ 5 అనే చిత్రంలో న‌టిస్తున్నారు. తాజాగా మ‌మ్ముట్టి క‌రోనా బారిన ప‌డ‌డంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.

Next Story