సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అశోక‌న్ క‌న్నుమూత‌

Malayalam director Ashokan passes away at 60 in Kochi.ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు అశోక‌న్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sept 2022 8:03 AM IST
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అశోక‌న్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు అశోక‌న్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని కేర‌ళ ఫిల్మ్ మేక‌ర్స్ అసోసియేష‌న్ ధృవీక‌రించింది. ఆయ‌న వ‌య‌స్సు 60 సంవ‌త్స‌రాలు

అశోక‌న్ అస‌లు పేరు రామ‌న్ అశోక్ కుమార్‌. 1980లో ద‌ర్శ‌కుడు శ‌శి కుమార్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను ఆరంభించారు. సైకలాజికల్ డ్రామాగా తెర‌కెక్కిన‌ 'వర్ణం' చిత్రంతో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా అరంగ్రేటం చేశారు. రెండో చిత్ర‌మైన 'ఆచార్య‌న్' క్రేజ్ తీసుకువ‌చ్చింది. 2003లో ఈయన దర్శకత్వంలో మలయాళ 'కైరాలీ' టీవీలో ప్రసారమైన 'కనప్పురమున్' ఉత్తమ టెలిఫిల్మ్ గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది.

అనంత‌రం అశోక‌న్ త‌మ మాకాంను సింగ‌పూర్‌కు మార్చ‌డాడు. దీంతో ప‌రిశ్ర‌మ‌కు దూరం అయ్యారు. బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. చేసింది త‌క్కువ చిత్రాలే అయినా త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అశోకన్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story