ప్రముఖ నటి సుబీ సురేష్ కన్నుమూత
నటి సుబీ సురేష్ కన్నుమూశారు. బుధవారం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 22 Feb 2023 3:21 PM ISTమలయాళ నటి సుబీ సురేష్ కన్నుమూశారు
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా మలయాళీకి చెందిన హాస్యనటి, టీవీ యాంకర్ సుబీ సురేష్ కన్నుమూశారు. ఆమె వయసు 41. సుబీ బుధవారం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సుబి స్నేహితుడు, హాస్యనటుడు టిని టామ్ మాట్లాడుతూ.. ''ఆమె (సుబి) గత కొన్ని రోజులుగా ఐసీయూలో ఉంది. ఆమెకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మేము ప్రతిదీ చేసాము. అయితే సుబీ పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు వెంటిలేటర్‌కు తరలించారు. మేము మా వంతు కృషి చేసాము, కానీ ప్రయోజనం లేకపోయింది'' అని తెలిపారు.
కొచ్చిన్ కళాభవన్ ట్రూప్‌లో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సుబీ క్రమంగా వినోద రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చాలా ఏళ్ల కిందట ఏసియానెట్‌లో ప్రసారమైన ‘సినీ మాల’ అనే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. మిమిక్రీ, తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుబీ 'కనక సింహాసనం', 'హ్యాపీ హస్బెండ్స్', 'తస్కరా లహలా', 'ఎల్సమ్మ ఎన్న ఆంకుట్టి', '101 వెడ్డింగ్స్' మరియు, 'డ్రామా' వంటి అనేక చిత్రాలలో కూడా నటించారు. సుబీ సురేష్ 20కి పైగా చిత్రాలలో నటించారు. సుబీ సురేష్‌కు తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు.
సుబీ సురేశ్ మరణం తర్వాత, మలయాళ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమకు చెందిన ఆమె సహచరులు తమ నివాళులర్పించేందుకు సోషల్ మీడియాకు వెళ్లారు. దుల్కార్ సల్మాన్, శ్వేతామీనన్, సాజన్ పల్లురూతి, మనోజ్ కె జయన్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. దురదృష్టకర వార్త గురించి తెలుసుకున్న నటి పెర్లే మానీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి తన సంతాపాన్ని తెలియజేశారు. సుబీ అకాల మృతి పట్ల అభిమానులు కూడా సంతాపం తెలిపారు. "అక్షరాలా ఆమె హాస్య ప్రదర్శనలు, సినిమాల్లో హాస్య పాత్రలు చూస్తూ పెరిగాను.. 2000ల ప్రారంభంలో ప్రధానంగా మగవారి ఆధిపత్యంలో ఉన్న కామెడీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక మహిళ చాలా త్వరగా వెళ్లిపోయింది.. ఆమెకు కేవలం 41 ఏళ్లు" అంటూ సోషల్ మీడియా యూజర్ ట్వీట్ చేశారు. ''విచారకరమైన వార్త. ఆమె అద్భుతమైన నటి'' అని మరొకరు ట్విట్టర్‌లో రాశారు.