సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎంతో మంది నటీ నటులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటి ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి కరోనాతో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. ఆమె మృతితో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
శరణ్య శశి విషయానికొస్తే.. గత పదేళ్లుగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌లో బాధపడుతున్నారు. ఆమె ఆర్టిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థిక సాయం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆమెకు 11 మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. ఈ క్రమంలో ఆమె బ్రెయిన్ ట్యూమర్ నుంచి కోలుకుంటోంది. అయితే.. ఇటీవల ఆమెకు కరోనా మహమ్మారి సోకింది. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనైంది. కుటుంబ సభ్యులు వెంటనే తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోయాయి. ఆగస్టు 9న ఆమె పరిస్తితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.
మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్‌తో బాగా పాపులర్ అయిన శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది. ఆమె మృతికి పట్ల పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.