నటి మీరా వాసుదేవన్ సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకం నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న మీరా వాసుదేవన్ తన లైఫ్ అప్‌డేట్‌ను సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. తన మూడవ వివాహం ముగిసినట్లు అధికారికంగా వెల్లడించారు.
మీరా వాసుదేవన్ తన ప్రకటనలో, "నేను, నటి మీరా వాసుదేవన్, అకా @officialmeeravasudevan, ఆగస్టు 2025 నుండి ఒంటరిగా ఉన్నానని అధికారికంగా ప్రకటిస్తున్నాను. నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను" అని అన్నారు. మీరా, విపిన్ పుతియంకం మొదటిసారి 'కుడుంబవిలక్కు' టెలివిజన్ షో సెట్స్‌లో కలుసుకున్నారు. వారి వృత్తిపరమైన సంబంధం వ్యక్తిగత అనుబంధానికి దారితీసింది, గత సంవత్సరం మేలో కోయంబత్తూరులో వారి వివాహం జరిగింది. పాలక్కాడ్‌కు చెందిన విపిన్, అనేక టీవీ షోలు, డాక్యుమెంటరీలలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు సంపాదించారు.