సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు ప్రదీప్ కొట్టాయం క‌న్నుమూత‌

Malayalam Actor Kottayam Pradeep passes away at 61.సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 11:17 AM IST
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు ప్రదీప్ కొట్టాయం క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు మృత్యువాత ప‌డుతున్నారు. నిన్న ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీ ల‌హిరి క‌న్నుమూయ‌గా.. నేడు కొట్టాయం ప్రదీప్ అని పిలుచుకునే ప్రముఖ మలయాళ నటుడు ప్రదీప్ కెఆర్ గుండెపోటుతో కేర‌ళ‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిశారు. ఆయ‌న వ‌య‌స్సు 61 ఏళ్లు. ప్ర‌దీప్‌కు భార్య మాయ‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌దీప్ ఆక‌స్మిక మ‌ర‌ణం మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్ర‌దీప్ మృతి ప‌ట్ల ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విచారం వ్యక్తం చేశారు. ప్రదీప్ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయనకు అంతిమ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం తెలిపారు.

ప్రదీప్ కొట్టాయం మరణ వార్త విని దర్శకుడు జాన్ మహేంద్రన్ కూడా షాక్ అయ్యారు. ప్రదీప్ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ నివాళి అర్పించారు. 'మలయాళ చిత్ర పరిశ్రమ స‌హ‌జ నటుడు అయిన ప్రదీప్ కొట్టాయంను కోల్పోయింది.' అని ట్వీట్ చేశారు.


40 ఏళ్ల వ‌య‌స్సులో ప్రదీప్ 2001లో నటుడిగా తన కెరీర్‌ని ప్రారంభించాడు. మొదట్లో సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించాడు. ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడు. 'ఒరు వడక్కన్ సెల్ఫీ', 'కుంజిరామాయణం', 'ఆడు ఒరు భీగర జీవి ఆను', 'వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు', 'కట్టపనాయిలే రిత్విక్ రోషన్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', మరియు 'ఆది కాప్యారే కూటమణి' వంటి చిత్రాల్లో న‌టించాడు. మలయాళం, తమిళంతో పాటు తెలుగులో నూ అక్కినేని నాగచైతన్య నటించిన 'ఏం మాయ చేశావే'మూవీలోనూ నటించారు. జార్జ్ అంకుల్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.

Next Story