ఆత్మహత్య చేసుకున్న మలైకా అరోరా తండ్రి
ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కన్నుమూశారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు
By Medi Samrat Published on 11 Sept 2024 2:37 PM ISTప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కన్నుమూశారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తన తండ్రి మరణంతో నటి మలైకా అరోరాతో పాటు ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.
ANI ప్రకారం.. మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బుధవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ముంబైలోని బాంద్రాలో తన ఫ్లాట్ పైనుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆయన ఇంటిని సీజ్ చేశారు. విషయం తెలిసిన మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమకు చాలా షాకింగ్ న్యూస్.
అనిల్ అరోరా పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో జన్మించారు. పంజాబీ కుటుంబానికి చెందిన అనిల్ నేవీలో అధికారిగా కూడా పనిచేశారు. ఆయన మలయాళ క్రైస్తవ మతానికి చెందిన జాయిస్ పాలీకార్ప్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి మలైకా అరోరా, అమృతా అరోరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మలైకా అరోరా తండ్రి అనిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుండగా.. తాజా అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అరోరా కుటుంబం మాత్రం తీవ్రమైన షాక్‌లో ఉంది.