నాగచైతన్య NC 22 ప్రీలుక్‌ పోస్టర్ వైర‌ల్

Makers Of NC 22 Reveal Pre-Look Poster.అక్కినేని నాగ చైత‌న్య వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Nov 2022 1:11 PM IST
నాగచైతన్య NC 22 ప్రీలుక్‌ పోస్టర్ వైర‌ల్

అక్కినేని నాగ చైత‌న్య వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. చైతన్య‌ కెరీర్‌లో 22వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు, త‌మిళ బాష‌ల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి క‌థానాయిక‌. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటోంది. ఇంకా ఈ చిత్రానికి పేరు ఖరారు చేయ‌లేదు.

తాజాగా ఈ చిత్ర ఫ్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ చిత్ర టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ నెల 23న(బుధ‌వారం) ఉద‌యం 10.18 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అందులో వెల్ల‌డించింది. పోలీసులు నాగ‌చైత‌న్య చుట్టూ చేరి తుపాకులు ప‌ట్టుకుని అత‌డిని అదిమిప‌ట్ట‌డం పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అరవింద్ స్వామి,శరత్ కుమార్, ప్రియమణి లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్నిఅందిస్తున్నారు.

Next Story