పాఠ‌శాల విద్యార్థుల‌కు 'మేజ‌ర్' స్పెష‌ల్ ఆఫ‌ర్‌

Major movie team gives special offer to school children.అడ‌వి శేష్ హీరోగా శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 9:01 AM IST
పాఠ‌శాల విద్యార్థుల‌కు మేజ‌ర్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌

అడ‌వి శేష్ హీరోగా శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'మేజ‌ర్‌'. 26/11 ముంబై ఉగ్ర‌దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. విడుద‌లైన‌ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని భారీ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది. ఈ క్ర‌మంలో పాఠ‌శాల విద్యార్థుల‌కు మేజ‌ర్ చిత్ర బృందం ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం గురించి విద్యార్థులంతా తెలుసుకోవాల‌నే ఉద్దేశంతో టికెట్ ధ‌ర‌పై 50 శాతం రాయితీ ఇస్తోంది.

పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక షో కోసం majorscreening@gmail.com కి మెయిల్‌ చేస్తే మేజర్‌ టీమ్‌ ఆ స్కూల్ విద్యార్థులకు స్పెషల్ షో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ మేర‌కు హీరో అడ‌వి శేష్ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

'మేజర్ చిత్రానికి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. కొన్ని రోజులుగా చాలామంది చిన్నారులు నాకు ఫోన్‌ చేసి, సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ కూడా మేజర్ సినిమా బాగా నచ్చింది. మేమూ మేజర్‌ సందీప్‌లా దేశం కోసం పోరాడతమని వాళ్ళు చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రం పిల్లలకు కూడా ఇంత బాగా నచ్చుతుందని మేము అనుకోలేదు. ఈ స్పందన చూసి మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. మరింతమంది విద్యార్థులు మేజర్‌ గురించి తెలుసుకుని స్ఫూర్తిపొందాలని, గ్రూప్‌ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. రేపటి తరానికి మేజర్‌ సందీప్‌ గురించి తెలియాలనేదే మా లక్ష్యం' అని ఆ వీడియోలో అడవి శేష్ అన్నారు.

Next Story